మొక్కులు తీర్చుకున్న పవన్ కళ్యాణ్
నూటికి నూరుశాతం ఎన్నికలలో గెలవడంతో జనసేన పార్టీ సంతోషానికి పగ్గాలు లేవు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో కూటమి గెలుపులో ప్రముఖపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు మొక్కుకున్న ప్రకారం అనకాపల్లిలో పర్యటించి పట్టణంలోని గ్రామదేవత నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అనకాపల్లిలో పర్యటించినప్పుడు కూటమి అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని ప్రకటించారు. దీనితో ఈ మొక్కును చెల్లించడానికి అనకాపల్లి చేరుకున్నారు. ఈ సంగతి తెలిసిన జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున అనకాపల్లికి వచ్చారు. పవన్ కళ్యాణ్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.


 
							 
							