Andhra PradeshHome Page Slider

వాలంటీర్లపై తనకు ఎలాంటి కోపం లేదన్న పవన్ కళ్యాణ్

ఏపీలో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థపై ఇటీవల పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందని..వాళ్ల సమాచారాన్ని వాలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు అందిస్తున్నారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వివరాలను కేంద్ర నిఘా వర్గాలు తనకు అందించినట్లు ఆయన తెలిపారు. కాగా ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలతో వాలంటీర్లు తమకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..తనకు వాలంటీర్ వ్యవస్థపై కోపం లేదని తెలిపారు.  ఏపీలో వాలంటీర్‌ పేరిట శ్రమ దోపిడి జరుగుతుందన్నారు. వాలంటీర్ల కంటే ముందే ఏపీలో నిత్యావసరాల పంపిణీ జరగలేదా?పవన్ ప్రశ్నించారు. జనసేన పార్టీ ఏపీలో  చేపట్టిన జనవాణి కార్యక్రమంలో వాలంటీర్లపై తనకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందువల్లే అలాంటి వ్యాఖ్యలు చేయాల్సివచ్చిందని  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.