పవన్ కళ్యాణ్ పిఠాపురంపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురం నుండి ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నారు. మూడు రోజుల పాటు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఉగాది వేడుకలు సైతం ఇక్కడే నిర్వహించేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ స్టే చేయడానికి అతిథి గృహాన్ని ఏర్పాటు చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.