పవన్ కళ్యాణ్ ఒక సూడో స్పిరిచ్యువలిస్ట్..
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక సూడో స్పిరిచ్యువలిస్ట్ అని, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి కొత్త పీఠాధిపతిగా వేషాలేస్తూ పవన్ స్వామిగా అవతరించారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఆయనకు హైందవ ధర్మం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కాషాయం ముసుగులో రాజకీయ లబ్ది పొందేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్‌కు సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియదన్నారు. సభలో భగవంతుని గురించి మాట్లాడతానని బిల్డప్ ఇచ్చి, జగన్ కేసుల గురించి మాట్లాడడాన్ని బట్టే ఆయనకు ఏమీ తెలియదని అర్థమయ్యిందన్నారు. తిరుపతిలో పవన్ వారాహి డిక్లరేషన్ సభ చూసి, అత్తారింటికి దారేది చిత్రంలో కెవ్వుకేక అంటూ దొంగబాబా పాట గుర్తొచ్చిందన్నారు. కల్లు తాగిన కోతిలా ప్రవర్తించాడని మండిపడ్డారు. కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు.