స్పీడ్ పెంచిన పవన్‌కళ్యాణ్
పవన్‌కళ్యాణ్ తాజాగా ఏపీ అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. ఆయన ఏపీలో రాజకీయం ముఖచిత్రం మారుతుందని కూడా పవన్ తెలిపారు. నోవాటెల్ హోటల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటి ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఆయన చిత్తూరు జిల్లాలోని రైతులతో సమావేశమయ్యారు. అక్కడ నుంచి పవన్‌కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ రాత్రి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో బస చేశారు. ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో పవన్‌కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. సమావేశానంతరం పవన్‌కళ్యాణ్ హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే పవన్‌కళ్యాణ్ ఆలోచనలు,నిర్ణయాలు ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలకు దారీతీస్తున్నట్లు కన్పిస్తున్నాయి.
Read more: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం: రాహుల్ గాంధీ