వైద్యుడిపై పేషెంట్ కత్తిపోట్లు…ముఖ్యమంత్రి ఆగ్రహం
చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. తన తల్లికి సరిగ్గా వైద్యం అందించలేదనే కోపంతో ఒక యువకుడు వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు. అంకాలజీ విభాగంలో పనిచేస్తున్న బాలాజీ జగన్నాథన్ అనే వైద్యునిపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. నిందితుడు పేషెంట్‌లా వచ్చి, డాక్టరును కత్తితో పలుమార్లు పొడిచి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతని తల్లికి ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స జరిగిందని, ఆమెకు సరిగా వైద్యం చేయకపోవడం వల్ల పరిస్థితి మెరుగు పడలేదని అతను కక్ష పెంచుకున్నట్లు తెలిపాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వైద్యుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. వైద్యులు సమయాన్ని పట్టించుకోకుండా రోగులకు సేవలందిస్తున్నారని, వారి కృషి మరువలేమని ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యులు ఈ ఘటనను ఖండిస్తున్నారు. వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.