Home Page SliderInternationalNewsTrending Today

‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సరికొత్త రికార్డు ..సూర్యునితో సయ్యాట

భగభగమండే సూర్యునికి అతిదగ్గరగా వెళ్లి, సురక్షితంగా వెనక్కి వచ్చి రికార్డు సృష్టించింది పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ షిప్. 2018లో నాసా ప్రయోగించిన ఈ వ్యోమనౌక సూర్యునిపై పలు పరిశోధనలు,అంతరిక్ష వాతావరణం, సౌర తుపాన్లు, సౌర జ్వాలల నుండి లోతుగా తెలుసుకోవడం కోసం ప్రయోగించారు. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పటి వరకూ 21 సార్లు సూర్యునికి చేరువగా వెళ్లినా, మునుపెన్నడూ లేనంతగా ఈ నెల 24న అతి దగ్గరగా 61 లక్షల కిలోమీటర్ల దూరానికి వెళ్లింది. ఆ సమయంలో 980 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ట్రోగ్రతను ఎదుర్కొంది. ఈ వ్యోమనౌక వేగం గంటకు 6.90 లక్షల కిలోమీటర్లు. అంటే కేవలం 30 సెకన్లలో న్యూయార్క్ నుండి లండన్ చేరుకోవచ్చు. సూర్యునికి దగ్గరగా వెళ్లాక దీనితో కమ్యూనికేషన్లు నిలిచిపోవడంతో ఈ నౌక సూర్యుని గ్రావిటీకి భస్మమయ్యిందని  నాసా శాస్త్రవేత్తలు టెన్షన్ పడ్డారు. కానీ శుక్రవారం (డిసెంబర్ 27) తిరిగి దాని నుండి సంకేతాలు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. జనవరి 1న దీని నుండి పూర్తి వివరాలతో కూడిన డేటా భూమికి అందనుంది.