Home Page SliderNationalSportsVideosviral

పంత్ సోదరి వివాహం..ధోనీ డ్యాన్స్ వైరల్

స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలో భారత మాజీ క్రికెటర్లు ధోనీ, రైనాలు సందడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన రిసెప్షన్‌లో వీరిద్దరూ డ్యాన్స్ చేయడంతో వీరి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ధోనీ, పంత్, రైనా కలిసి గ్రూప్‌గా డ్యాన్స్ చేసిన ఒక వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ధోనీ ఐపీఎల్ సన్నాహాలలో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడుకకు భార్యతో సహా హాజరయ్యారు. ఇక రైనా ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.