అమృత్‌సర్‌లో పాక్ మిసైల్ కలకలం..బ్లాక్ అవుట్ ప్రకటన
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాక్ మిసైల్ కలకలం రేపింది. పాకిస్తాన్ ప్రయోగించిన ఈ మిసైల్‌ను భారత బలగాలు గాల్లోనే ధ్వంసం చేశాయి. అమృతసర్ వద్ద మూడు గ్రామాలలో ఈ క్షిపణి శకలాలు పడి ఉన్నాయని గుర్తించారు. జేతువాల్, పంధేర్, దుధాల గ్రామాలలో క్షిపణి శకలాలు లభించాయి. ఈ ఘటనతో అమృతసర్‌లో బ్లాక్ అవుట్ ప్రకటించి రాత్రంతా చీకటిగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్ పోలీసుల సెలవులు కూడా రద్దు చేశారు. పంజాబ్ వద్ద బటిండాలో అకాలియా అనే గ్రామంలో రాత్రి భారీ పేలుడు సంభవించగా ఇద్దరు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని సమాచారం. ఇదేవిధంగా హాజీపూర్ వద్ద కూడా గుర్తు తెలియని ఆకారం పడిపోయిందని భారీ శబ్దాలు వచ్చాయని సమాచారం.