పాక్‌కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి..
పాకిస్థాన్‌లోని లాహోర్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ దాడిని బెలూచిస్తాన్ ఉగ్రవాదులు చేసినట్లు సమాచారం. దీనితో పాక్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారయ్యింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన మిస్సైల్ దాడి నుండి ఇంకా కోలుకోని పాక్‌కి మరో వైపు నుండి బెలూచిస్తాన్ దాడి చెమటలు పట్టిస్తోంది. ఈ పేలుడుకు ముందు రెండు మూడు సార్లు భారీ శబ్దాలు వినిపించాయని, దట్టంగా పొగ కనిపించిందని స్థానికులు చెప్తున్నారు. దీనితో లాహోర్ విమానాశ్రయాన్ని మూసివేశారు. అయితే డ్రోన్ కారణంగా పేలుడు సంభవించినట్లు పాక్ పోలీసులు చెప్తున్నారు. దీనికి ముందుగా సైరన్లు కూడా మోగడంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశామని ప్రజలు చెప్తున్నారు.

