Home Page SliderTelangana

తెలంగాణాలో కార్పోరేషన్ల చైర్మన్ల నియామకానికి ఉత్తర్వులు జారీ

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో కార్పోరేషన్ల చైర్మన్ల నియామకానికి జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా  విడుదలయ్యాయి. అయితే కార్పోరేషన్ చైర్మన్‌లుగా 35 మందిని  నియమిస్తూ మార్చి 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో తెలంగాణా ప్రభుత్వం కార్పోరేషన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం విత్తనాభివృద్ధి అన్వేష్ రెడ్డి,రాష్ట్ర సహకారం సంఘం మోహన్ రెడ్డి,కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ జంగారెడ్డి,ఫిషరీస్ సొసైటీస్-మెట్టు సాయి కుమార్,ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్‌గా కాసుల బాలరాజును ప్రభుత్వం నియమించింది.