ప్రతిపక్షం కొత్తకాదు…అధికారం దూరం కాదు
ప్రతిపక్ష పాత్ర పోషించడం వైసీపికి కొత్త కాదని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.వైసీపి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం తాడేపల్లి కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా జగన్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరించారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తీరుని దుయ్యబట్టారు.నిరుద్యోగ భృతి,ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇలాంటి పథకాలేమీ అమలు చేయకుండా కక్షారాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ప్రతిపక్ష పాత్ర తమ పార్టీకి కొత్తకాదని,అదేవిధంగా అధికారం కూడా తమ పార్టీకి దూరం కాదని ,పోరాటాల ద్వారా మళ్లీ అధికారానికి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నందమూరి లక్ష్మీ పార్వతి సహా మాజీ మంత్రులు,ప్రముఖులు ఉన్నారు.