Breaking NewscrimeHome Page SliderNews AlertTelanganatelangana,

వీడియోకాల్ ద్వారా ఆపరేషన్..కవలపిల్లల మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. అక్కడ ఒక వీడియోకాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని దానివల్ల కవలపిల్లలు మృతి చెందారని బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంగా  గర్భవతికి సిజేరియన్ చేశారని, దీనివల్ల మృత కవల శిశువులు జన్మించారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.