ఏదో ఒక రోజు మా లోకేష్ ప్రధాని అవుతాడు
పొలిటికల్ ట్రోల్స్ అన్నీ టిడిపి నుంచే వస్తుంటాయనేది జగద్వితం.అలాంటి ట్రోల్ ఒకటి నారా లోకేష్ పుట్టిన రోజున పుట్టింది. అదేంటో వింటే ఒకింత ఆశ్యర్యం…మరొకింత ఒళ్లు గగుర్పాటు రెండూ పుట్టుకొస్తాయి.గురువారం ఐటి మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ…ఏదో ఒక నాడు పీవి నరసింహారావు తరహాలో మా లోకేష్ కూడా ఈ దేశానికి పీఎం అవుతాడంటూ వ్యాఖ్యానించారు.మెచ్యూరిటీతో అన్నాడో లేదా మెమరీ లాస్ అయ్యి అన్నాడో తెలీదు గానీ ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలే దావోస్ పెట్టుబడులు లేక అల్లాడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఐటి మంత్రిని మరింత బజారుపాలుజేస్తారా అంటూ టిడిపి సీనియర్లు తలలు బాదుకుంటున్నారు.