Home Page SliderTelangana

కడెం అడవుల్లో అరుదైన కప్పను గుర్తించిన అధికారులు

నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో కల్లెడ డీఆర్‌ఓ ప్రకాష్, ఎఫ్‌బీఓ ప్రసాద్‌లు గస్తీ తిరుగుతుండగా ఈ కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు. ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్, శ్రీలంక బుల్ ఫ్రాగ్ పేర్లతో పిలిచే ఈ కప్ప చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని డీఆర్‌ఓ తెలిపారు. ఈ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లో నేల లోపలి పొరలలో ఉండి.. వర్షాకాలం ప్రారంభంలో బయటకు వచ్చి గుడ్లు పెడతాయన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఇవి జీవిస్తాయని అధికారులు వెల్లడించారు.