తెలంగాణలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల …. ఎప్పుడంటే ?
తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం గారు మార్చి 31 నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రకటించారు. ఈ ప్రకటనతో నిరుద్యోగులలో ఆనందం వెల్లువెత్తింది. నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేస్తామని, అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని బుర్రా వెంకటేశం చెప్పారు. మార్చి 31 నుండి ఉద్యోగ ఖాళీల వివరాలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు బుర్రా వెంకటేశం చెప్పారు. ఏప్రిల్ నెలలో ఖాళీల ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రకటన చేశారు. మే 1 నుండి కొత్త ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్లు విడుదల చేయబడతాయని తెలిపారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను 6 నుండి 8 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు, మరియు గ్రూప్-3 ‘కీ’ ఇటీవల విడుదల చేసినట్లు బుర్రా వెంకటేశం ప్రకటించారు. గ్రూప్-2 ‘కీ’ రెండు రోజుల్లో విడుదల చేస్తామని అన్నారు. అలాగే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను కూడా వారం-పది రోజుల్లో విడుదల చేస్తామని అన్నారు. యూపీఎస్సీ మరియు ఎస్ఎస్సీ ఫార్మాట్‌లో పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.