Home Page SliderInternational

పుష్ప 2 కాదు… పుష్ప 3పై అల్లు అర్జున్ క్లారిటీ!

Share with

ఇప్పటి వరకు పుష్ప 2 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే పుష్ప సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ నే కాదు.. దేశ వ్యాప్తంగా, ఒకరకంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా పుష్ప దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ కోసం సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పుష్ప 3 సీక్వెల్ కూడా ఉంటుందని, అందుకు తగిన కథ కూడా సిద్ధం చేస్తున్నారంటూ లెటెస్ట్ న్యూస్ చెప్పారు అల్లు అర్జున్. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అల్లు అర్జున్ భవిష్యత్ సినిమాల గురించి మాట్లాడారు. 2021లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్‌… ‘పుష్ప 2: ది రూల్’ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా మూడో పార్ట్ గురించి ఆలోచిస్తున్నట్టుగా అల్లు అర్జున్ చెప్పాడు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తామన్నాడు. “పుష్ప 2… పుష్ప 1’లో చూసిన దానికంటే చాలా భిన్నమైన పుష్ప షేడ్స్ ఉంటాయని చెప్పాడు. గతంలో సినిమా ప్రాంతీయ స్థాయిలో ఆడిందని.. అది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడుతుందని చెప్పాడు. “పుష్ప 1లో, ఫహద్ ఫాసిల్ పోషించిన పోలీసు అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పుష్పకు ముల్లులా కనిపించాడు. వారి మధ్య వివాదం “చాలా పెద్ద, పెద్ద స్థాయికి” పెరుగుతుంది. అదే పార్ట్ 2లో చూపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ యెర్నేని మరియు యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. పుష్ప 2: ది రూల్ ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.