Home Page SliderNational

ఢిల్లీ బీజేపీ పెద్దలతో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ మంతనాలు

Share with

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మరియు అతని కుమారుడు నకుల్ బిజెపిలో చేరవచ్చని వర్గాలు తెలిపాయి. ఈరోజు తెల్లవారుజామున ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన బీజేపీలోకి మారే అవకాశం ఉందనే ఊహాగానాలు తారాస్థాయికి చేరుకోవడంతో, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజధానిలో అధికార పార్టీ నాయకత్వాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్ కాంగ్రెస్‌ను వీడుతున్నారనే పుకార్లు గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఏకైక కాంగ్రెస్ ఎంపీ అయిన నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుండి పార్టీ పేరును తొలగించడం, కమల్ నాథ్ ఢిల్లీకి రావడంతో పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల ప్రారంభంలో, నకుల్ నాథ్ 2019లో గెలిచిన చింద్వారా లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ కోసం వేచిచూడకుండా, తనని తాను అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు. “ఈసారి కూడా నేనే లోక్‌సభ ఎన్నికలకు మీ అభ్యర్థిని. కమల్‌నాథ్‌ లేదా నకుల్‌నాథ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయని, కమల్‌నాథ్‌ ఎన్నికల్లో పోటీ చేయరని నేను స్పష్టం చేస్తున్నాను.” అని కాంగ్రెస్ ఎంపీ తన నియోజకవర్గంలో ఒక సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

కమల్‌నాథ్‌ బీజేపీలో చేరతారా లేక కాంగ్రెస్‌ నుంచి వైదొలగడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే నకుల్‌నాథ్‌కి లోక్‌సభ ఎన్నికల్లో చింద్వారా నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్‌ లభించే అవకాశం ఉందని, ఆయన పార్టీలో చేరే ప్రక్రియపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ శనివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అయితే, మీరు బీజేపీలో చేరుతున్నారా అని అడిగినప్పుడు, “అలాంటిది ఏదైనా ఉంటే, నేను ముందుగా మీకు తెలియజేస్తాను” అని నాథ్ చెప్పారు. “ఇది తిరస్కరించడం కాదు, మీరు ఇలా చెప్తున్నారు, మీరు ఉత్సాహంగా ఉన్నారు, నేను ఈ వైపు లేదా ఆ వైపు ఉత్సాహంగా లేను, కానీ ఉంటే అలాంటిదేమైనా, ముందుగా మీకు తెలియజేస్తాను.”