‘ఎనుముల కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి’..హరీష్ రావు
‘నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి’ అంటూ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, చీప్ మినిస్టర్’ అన్నారు. దమ్ముంటే గన్‌మేన్లు లేకుండా అశోకనగర్‌కు రావాలని సవాల్ విసిరారు. ఈ జీవో 29తో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అన్యాయం చేస్తోందంటున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చినట్లే జీవో ఇవ్వాలన్నారు.