మునుగోడులో భారీగా నామినేషన్లు
మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికార,ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలలో బిజీబిజీగా ఉన్నాయి. మరోపక్క పార్టీలు ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నాయి. దీంతో తెలంగాణా రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. ఈ మునుగోడు ఉపఎన్నికల కోసం తెలంగాణాలోని అన్నీ పార్టీలు నువ్వా-నేనా అంటూ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి.

