‘బడ్జెట్‌లో మహిళలకు మొండిచెయ్యి’..వైసీపీ
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నెలల బడ్జెట్‌లో మహిళలకు ‘మొండిచెయ్యి’ చూపిందని వైసీపీ పార్టీ ఆరోపించింది. ఎన్నికల ముందు మహిళలకు ‘ఉచిత బస్ ప్రయాణం’ అని హామీ ఇచ్చి, ఇంతవరకూ దాని ఊసే లేదని, బడ్జెట్‌లో కూడా ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదని విమర్శించింది. ఆడపడుచులు, రైతులను దారుణంగా మోసం చేశారన్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి అతి తక్కువ మొత్తాన్ని కేటాయించారని, ఇంటర్ విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం తీసేశారని మండిపడ్డారు. 19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని గాలికొదిలేశారని, ఏడాదికి రూ.18వేలు ఆర్థిక సాయంపై కూడా ఎలాంటి ప్రకటన లేదన్నారు. బడ్జెట్‌లో ‘మహాశక్తి పథకం’ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అసలు మహిళలకు ఈ ప్రభుత్వంలో ఏదైనా పథకాలున్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు.


 
							 
							