Andhra PradeshHome Page Slider

“రాష్ట్రానికి మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు”: ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులోని కొలనుకొండలో పర్యటించారు. కాగా సీఎం అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం అనంత శేషస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు.కాగా అక్షయపాత్ర స్పూర్తితో ఏపీలో త్వరలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామన్నారు. పేదరికం లేని సమాజం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి దయవల్ల అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానన్నారు. కాగా ప్రజలకు సేవ చేసేందుకే ఆ స్వామి నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి మంచి చేయాలనుకునేవారంతా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.