‘మంత్రులెవ్వరూ ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దు’..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం స్కామ్ విషయంలో విచారణ కొనసాగుతోందని, ఈ విషయంలో మంత్రులెవ్వరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పాలన చట్టబద్దంగా జరుగుతోందని, విచారణలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎవరు తప్పు చేసినా, విడిచిపెట్టేది లేదన్నారు. వారికి శిక్ష తప్పదన్నారు. అలాగే లిక్కర్ స్కామ్‌పై మంత్రులు కామెంట్స్ చేయవద్దన్నారు. నిజాలు విచారణలో తెలుస్తాయన్నారు.