“ఎన్ని జన్మలైనా జైల్లో ఉంటా”..అప్ నేత సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ‘ఎన్ని జన్మలైనా జైల్లో ఉంటా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యనే తీహార్ జైలు నుండి బెయిల్‌పై బయటకొచ్చారు మనీష్. మద్యం స్కామ్ కేసులో అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది ఈడీ. 18 నెలలకు పైగా జైలు జీవితం గడిపి, ఎట్టకేలకు బెయిల్ లభించి బయటపడ్డారు సిసోదియా. ఆయన ఢిల్లీలో పాదయాత్రలో పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతుల కోసం ఎన్ని జన్మలైనా జైలులో ఉంటానని ఈ సందర్భంగా ఢిల్లీ వాసులకు చెప్పారు. త్వరలోనే సీఎం కేజ్రీవాల్ కూడా జైలు నుండి విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

