అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావద్దు: హరీష్‌రావు
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌కు రావద్దని అభిమానులకు ఎమ్మెల్యే హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కాగా, కేసీఆర్‌ను పరిశీలించిన డాక్టర్లు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాలు పడుతుందని హరీష్‌రావు తెలిపారు.

