నిమ్స్ సరికొత్త రికార్డు..
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి సరికొత్త రికార్డు సృష్టించింది. అవయవాల మార్పిడి చేయించుకోలేని పేదల ప్రాణాలను నిలబెడుతోంది. ఇప్పటి వరకూ 85 రోజుల్లో 41 కిడ్నీల మార్పిడి చేసి రికార్డు నెలకొల్పింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవాల దానానికి ముందుకు రావడం వంటి చర్యల వల్ల అనేక మందికి కొత్త జీవితం లభిస్తోంది. ఇలా అవయవ మార్పిడి చేయించుకున్నవారిలో 90 శాతం మంది పేదలే కావడం విశేషం. కాలేయం, గుండె మార్పిడి వంటి ఆపరేషన్లకు ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 40 లక్షల వరకూ ఖర్చు అవుతుండగా నిమ్స్‌లో పూర్తి ఉచితంగా చేస్తున్నామని వైద్యులు తెలిపారు. నిమ్స్ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ ట్రస్ట్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారికే ముందుగా అవకాశం కల్పిస్తున్నారు.

