కొవిడ్ కొత్త వేరియంట్స్..పలు రాష్ట్రాలు అప్రమత్తం
కరోనా వైరస్ కొత్త రూపంతో మళ్లీ భయపెడుతోంది. కొత్త వేరియంట్లు ప్రజలపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. దీనితో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో కొత్త కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రులను సిద్దం చేస్తున్నారు. అయితే భయపడాల్సిందేమీ లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, బాధితులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

