HealthHome Page Slider

సులువైన, సరికొత్త గర్భనిరోధక సాధనం వచ్చేసింది

దంపతులు రకరకాల గర్భనిరోధక పద్ధతులు అవలంభిస్తూ ఉంటారు. వివాహం జరిగిన వెంటనే పిల్లలు వద్దనుకొనేవారు, ఇద్దరు పిల్లలకూ కొన్ని సంవత్సరాలు ఎడం ఉండాలనుకొనేవారు తాత్కాలిక గర్భనిరోధక వస్తువులను, మాత్రలను వాడుతుంటారు. అయితే ఇవి కొంతమందికి సరిపడకపోవచ్చు. సైడ్ ఎఫెక్టులకు, దుష్ప్రభావాలకు గురవుతూ ఉంటారు. ఇప్పడు కొత్తగా చాలా సులువైన,  సైడ్ ఎఫెక్టు లేని సాధనాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. దీనిని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అంటారు.

ఈ పద్దతిలో సన్నటి సూది వంటి పరికరాన్ని మహిళల మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. ఇది మూడు సెంటీమీటర్ల పొడవు, మూడు మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. దీనినుండి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది అండాశయం నుండి అండం ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాలల్లో అమల్లో ఉంది. దీనిని తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలలో కూడా అమలులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం డాక్టర్ కూడా అవసరం లేదు. స్టాఫ్ నర్సులు కూడా దీనిని అమర్చడానికి శిక్షణ ఇవ్వొచ్చు. ఇది మూడేళ్లవరకూ పనిచేస్తుంది. ప్రసవం జరిగిన వెంటనే, పాలిచ్చే తల్లులకు కూడా దీనిని అమర్చవచ్చు. కెన్యాలో ఈ పద్దతి 25 ఏళ్లుగా ఉంది. భారత వైద్య, ఆరోగ్య బృందం కెన్యాలో పర్యటించి దీనిపై అధ్యయనాలు చేశారు. ఈ పద్దతి సురక్షితమేనని తేల్చారు. త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.