Editorial NewsNationalNews AlertTrending Todayviral

నీట్‌ పీజీ 2025 పరీక్ష షెడ్యూల్‌ విడుదల…!

పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-PG) 2025 పరీక్షకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) కీలక నిర్ణయం తీసుకుంది. NEET-PG 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షను జూన్ 15, 2025 న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్షగా కంప్యూటర్ ఆధారిత ప్లాట్‌ఫామ్ పై నిర్వహించబడుతుంది. మొదటి షిఫ్ట్: ఉదయం 9.00 AM నుంచి 12.30 PM వరకు రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 3.30 PM నుంచి 7.00 PM వరకు, అన్ని పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్, కంప్యూటర్ లాగిన్ ప్రక్రియ మొదలైన వాటిని పూర్తి చేసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఎంఎస్ కోర్సులు: 12,690 సీట్లు, ఎండీ కోర్సులు: 24,360 సీట్లు, పీజీ డిప్లొమా కోర్సులు: 922 సీట్లు. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు మరియు పూర్తి షెడ్యూల్‌ NBEMS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.