నయనతార షూటింగ్ వెళ్లే ముందు పిల్లలతో..
నయనతార తన ట్విన్ బాబులు ఉయిర్, ఉలాగ్‌లతో ఆడుకుంటున్న చిత్రాలను షేర్ చేసింది. ఆమె షూటింగ్‌కు వెళ్లేముందు కొంత సమయం పిల్లలతో గడుపుతానని చెప్పుకొచ్చారు. నయనతార తన కవల కుమారులు ఉయిర్, ఉలాగ్‌ల కొన్ని ఫోటోలను అభిమానులకు అందించింది. ఇంతకుముందు, నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నందున తాను మిస్ అవుతున్నానని పేర్కొంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని త్రోబాక్ ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఫోటోలను షేర్ చేస్తూ, నేను షూటింగ్‌కు బయలుదేరే ముందు కొంత సమయం పిల్లలకి కేటాయిస్తానని అని రాసుకొచ్చారు. ఫోటోలలో, ఆమె తన కవల మగ పిల్లలతో ఆడుకోవడం మనం చూస్తున్నాం. నయన్ వదులుగా ఉన్న ఆకుపచ్చ టీ-షర్ట్, నీలిరంగు ధోతీ ప్యాంటు ధరించి కనిపిస్తోంది. చిన్నారులు కాటన్ షర్టు-షార్ట్‌ల కాంబోలు వేసుకున్నారు.