జాయింట్ ఫ్యామిలీకి నటాషా వ్యతిరేకి: అలీ గోని
భారత క్రికెటర్ హార్దిక్‌కు గుడ్‌బై చెప్పిన నటాషా అంతకుముందు నటుడు, మోడల్ అలీ గోనితోనూ చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే తాము విడిపోవడానికి గల కారణాన్ని గోని తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. ‘నటాషా నా కుటుంబంతో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. వేరింటి కాపురం పెడదామంది, నాతో కూడా పలుసార్లు చెప్పింది. నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టలేనని అది నా వీక్‌నెస్ అని సర్ది చెప్పాను. దానికి ఆమె అంగీకరించలేదు, ఆ కారణంగానే మేము ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నటాషా – గోని ఓ డ్యాన్స్ షోలో కలిసి నర్తించారు.