Breaking NewscrimeHome Page SliderNews AlertTelangana

నారాయ‌ణ‌…నారాయ‌ణ‌

నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో ప్రతీ ఏటా వినిపించే ఆత్మ‌హ‌త్యల ఘోష‌లు ఈ ఏడాది అనంత‌పురం నుంచి ప్రారంభం అయ్యాయి.ప్ర‌తీ ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా విద్యాసంస్థ‌ల్లో విద్యార్ధులు ఏదో రూపంలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తుంది.ఇందులో భాగంగా తొలి సూసైడ్ అనంత‌పురంలో గురువారం న‌మోదైంది.అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య కు పాల్ప‌డ్డాడు.ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో అధ్యాప‌కులు,విద్యార్ధులు అంతా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఎవ‌రో పిలిచిన‌ట్లుగానే వెళ్లిన విద్యార్ధి…త‌న పాద‌ర‌క్ష‌ల‌ను త‌ర‌గ‌తి గ‌దిలోనే విడిచి క్ష‌ణాల వ్య‌వ‌ధిలో బిల్డింగ్ పై నుంచి దూకి చ‌నిపోయాడు.