Andhra PradeshHome Page Slider

పాదయాత్రలో నారా లోకేష్ భుజానికి గాయం

46వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర
పాదయాత్రకు ముందు నిత్యం “లోకేశ్ తో సెల్ఫీ” కార్యక్రమం
రోజుకు వెయ్యి మందితో లోకేష్ సెల్ఫీలు
ఇవాళ సెల్ఫీలు తీసుకోవడంలో అసౌకర్యం

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కడిమానిపల్లి విడిసెంటర్ నుంచి 46వ రోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కుడి భుజానికి గాయమైనట్లు కనిపించింది. 45 రోజుల పాటు చిత్తూరు జిల్లా యాత్ర తర్వాత లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. భారీగా కార్యకర్తలు లోకేష్‌ను చూసేందుకు తరలివచ్చారు. దీంతో తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో లోకేష్ కుడి భుజానికి గాయమయ్యింది. ప్రతిరోజు లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు “లోకేశ్ తో సెల్ఫీ” కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా రోజూ దాదాపు వెయ్యి మందితో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. భుజం గాయం కారణంగా, లోకేష్ శనివారం సెల్ఫీలు తీసుకోలేకపోయాడు. ఇందు కోసం ఇతరుల సహాయంపై ఆధారపడవలసి వచ్చింది. అభిమానులు తమ బిడ్డను ఎత్తుకొని సెల్ఫీ కోరగా.. భుజం నొప్పిగా ఉందని వారికి లోకేష్ వివరించారు. పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ భుజాలు ఎత్తే సమయంలో కూడా అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది.