వాలంటీర్లు రాజకీయాలు మానుకోవాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు
జగన్ నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… కావాలనే వారిని అభద్రత భావనలోకి నెట్టేస్తున్నారన్నారు. గంగాధర నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు, వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వస్తే ఏదో చేస్తారని… జగన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే అందుకు తాము వ్యతిరేకం కాదని.. వైసీపీకి పనిచేస్తే ఊరుకోమన్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాలంటీర్లు రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబు హితవుపలికారు. రెండు నెలల్లో స్మగ్లర్లను, అవినీతిపరులు ఆటకట్టిస్తానన్నారు. ఓటు కాపాడుకోండి.. ఓటర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
రా కదలిరపా అన్నది తన కోసం కాదని.. ఐదు కోట్ల ప్రజల కోసమని, యువత, ఆడ బిడ్డల రక్షణ కోసమన్నారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది జీవితాశయమన్నారు చంద్రబాబు. ప్రపంచంలో తెలుగుజాతి నెంబర్ 1 కమ్యూనిటీగా నిలవాలన్నారు. హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పన టీడీపీ దూర దృష్టికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు. రాతి యుగం కాకుండా స్వర్ణయుగం వైపు వెళ్లడం కోసం తాను పనిచేస్తానన్నారు. చంద్రన్న నీ వెంటే అంటూ ఆడిబడ్డలు కదలివస్తున్నారని… ఇటు యువత, ఆటు ఆడబిడ్డలతో గెలుపు టీడీపీ-జనసేనదేనన్నారు. జగన్ తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారన్నారు. రాత్రిళ్లు నిద్రరావడం లేదన్నారు.

అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టకుంటున్నారన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారన్నారు. జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజల జీవితాలను నాశనం చేసి… సిద్ధం కటౌట్లు పెట్టారని… జగన్‌ను చీకొట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐప్యాక్ పెట్టుకొని ఓటును రిమోట్ కంట్రోల్ ద్వారా ఓట్లు తీస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో చొరబడి ఐప్యాక్ ఫైల్స్ దొంగిలించిందని ఆరోపించారు. దోషులను శిక్షించేవరకు వదిలిపెట్టేది లేదన్నారు చంద్రబాబు. ఎర్రచందనం స్మగ్లర్‌కు వైసీపీ సీటిచ్చిందన్నారు చంద్రబాబు. చిత్తూరు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ సర్కారు హయాంలో పోలీసులకు రక్షణ కరువైందన్నారు చంద్రబాబు. టీడీపీ హయాంలో స్మగ్లర్లు ఎవరూ కూడా రోడ్డుపైకి రాలేదన్నారు.