“NANI 30” టైటిల్, గ్లింప్స్ విడుదల
నేచురల్ స్టార్ “నాని” ఈ ఏడాది ప్రారంభంలోనే దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మరో సినిమాతో ఈ ఏడాది మరోసారి మన ముందుకు రాబోతున్నారు. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “NANI30”సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. కాగా ఈ సినిమాకు “హాయ్ నాన్న” అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను కూడా మేకర్స్ తాజాగా షేర్ చేశారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా ఈ సినిమాలో నాని సరసన “సీతారామం” హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

