Home Page SliderTelangana

మంత్రిపై నాగార్జున దావా..కోర్టు విచారణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నేడు నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావాపై న్యాయవాది వాదనలు వినిపించారు. నాగార్జున, ఇతర సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తన కుటుంబంపై, నాగ చైతన్య, సమంతల విడాకులపై రాజకీయ దురుద్దేశంతో మంత్రి సురేఖ నిరాధార వ్యాఖ్యలు చేశారని నాగార్జున ఆరోపించారు. దీనితో పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యానించిన ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో దావా వేశారు.