హత్య వీడియో వైరల్.. మిస్టరీగా మారిన కేసు
ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతుడి వివరాలు తెలియక, హత్య కేసు మిస్టరీగా మారింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో తీసిన వ్యక్తిని గుర్తించారు. అతను దూరంగా ఉండి వీడియో తీసినట్లు చెప్పగా, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.