అత్యంత నమ్మకమైన దేశంగా భారత్‌ని కొనియాడిన-ముయిజ్జు
మాల్దీవుల నుండి భారత్ జాడల్ని తరిమికొట్టాలంటూ ఒకప్పుడు పెద్ద ప్రచారాన్నే నిర్వహించిన ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామి అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. భారత్ – మాల్దీవుల బంధం బలోపేతానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా భారత్ అండగా ఉంటోంది. ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం అని పేర్కొన్నారు.


 
							 
							