Home Page SliderNational

‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ మెట్రో ట్రైన్‌లో!

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టీమ్ సరికొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. హైదరాబాద్ మెట్రోలో అనౌన్స్‌మెంట్‌లో తలుపు ఎడమవైపున తెరుచుకుంటాయి అని మాత్రమే వింటోన్న ప్రయాణికులను రవితేజ వాయిస్ సర్‌ప్రైజ్ చేసింది. అందులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా రిలీజ్ గురించి ప్రయాణికులకు తెలియజేస్తూ ఆగస్టు 15న మూవీ చూడాలని రవితేజ కోరారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించారు.