హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటీషన్లో కోరారు. మంగళవారం అవినాష్ రెడ్డి యాంటీ సిపేటరీ బెయిల్ దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తమ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలుమార్లు సిబిఐ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా కేసు విచారణను త్వరగా ముగించాలని ఆదేశించిన నేపథ్యంలో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.