వైజాగ్‌లో తల్లి, కుమార్తెపై కత్తితో దాడి
ఏపీలోని వైజాగ్‌లో దారుణం జరిగింది. అక్కడ మధురవాడలోని స్వయంకృషి నగర్‌లో ఒక యువతి, ఆమె తల్లిపై ఒక ప్రేమోన్మాది కత్తితో దాడి చేశారు. నేడు మధ్యాహ్నం వేళ దీపిక అనే యువతి ఇంట్లోకి చొరబడి ఆమెను, ఆమె తల్లి లక్ష్మి(43) అనే మహిళను కత్తితో పొడిచి పారిపోయాడు. అయితే తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. యువతి దీపిక తీవ్ర గాయాల పాలయ్యింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీపిక డిగ్రీ చదువుకున్నారు. ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.


 
							 
							