Home Page SliderTelangana

భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

తెలంగాణాలో గత 3 రోజల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా  ఈ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని  స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ భారీ వర్షాలకు తెలంగాణాలోని వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా వలిగొండ మండలం సంగం పరిధిలో మూసీ వంతెన పైనుంచి వరదనీరు  ప్రవహిస్తోంది. దీంతో అక్కడ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మేరకు బొల్లేపల్లి -చౌటుప్పల్ మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అంతేకాకుండా రుద్రవల్లి వద్ద కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పోచంపల్లి-బీబీనగర్ మార్గంలో కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలంగాణాలో జూలై నెల మొత్తం కురవాల్సిన వర్షపాతం 24 గంటల్లోనే నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.