Breaking NewsNational

వారణాశి యాత్రికులకు మోదీ కానుక -మెగా రోప్‌వే

Share with

భూలోక కైలాసంగా పేరుపొందిన వారణాశికి  మరో రికార్డు రాబోతోంది. భారత్‌లోనే మొట్టమొదటి అర్భన్ రోప్‌వేగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు మోదీ. ఇది 2025 మే నెల నాటికి పూర్తవుతుంది. ఈ మార్గం కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌కు గోడొవాలియా చౌక్‌కు మధ్య ఇరుకైన ప్రయాణాన్ని కేవలం 17 నిముషాల్లో జరిగేలా చేస్తుంది. పరమ పుణ్యక్షేత్రమైన కాశీని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, పవిత్రగంగలో స్నానమాచరించాలని కోరుకోని హిందువులుండరు. తమ పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించాలంటే కాశీలో అస్తికలు కలపాలని వారసులు కోరుకుంటారు. అలాంటి వారణాశికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రధాని మోదీ ఇప్పటికే కాశీ విశ్వనాధ దేవాలయాన్ని సుందరీకరించారు. గంగాప్రక్షాళణ ప్రారంభించి గంగను కాలుష్యరహితంగా మార్చారు.

ఇప్పుడు కాశీ రహదారులలో ఇరుకుగా నడుస్తూ ఇబ్బందులు పడే అవసరం లేకుండా మెగా రోప్‌వేకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టు 644 కోట్ల రూపాయలతో పట్టాలెక్కనుంది. ఈ రోప్‌వే మార్గంలో వారణాశి కాంట్ నుండి కాశీ విద్యాపీఠం, రథయాత్ర, చర్చి, గొదాలియా కూడలి మొదలైన ప్రాంతాలు వస్తాయి. వీటిలో మొత్తం 5 స్టేషన్లు ఉంటాయని వారణాశి డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ -చైర్మన్ అభిషేక్ గోయల్ తెలియజేశారు. దీనితో కాశీని ఆకాశమార్గంలో కూడా దర్శించే అవకాశం కలుగనుంది.