Andhra PradeshHome Page Slider

అజ్ఞాతంలో ఎమ్మెల్యే రాపాక

‘దొంగఓట్ల’ వల్లే గెలిచానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన  రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం సఖినేటిపల్లి గ్రామంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా ప్రకటించారు అధికారులు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు సమాచారం. దొంగనోట్ల వ్యవహారం స్వయంగా ఆయనే ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడడం చాలా వైరల్ అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో చింతలపల్లిలో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా ముగించుకుని అక్కడ నుండి జారుకున్నారు రాపాక వరప్రసాద్.