Andhra PradeshHome Page Slider

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. ఎలాగైనా ఒక స్థానాన్ని గెలుచుకోవాలని భావిస్తున్న టీడీపీ… పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది. చంద్రబాబుతో కలిసే 19 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌‌లవో పాల్గొననున్నారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు వారందరూ ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోటీ చేస్తున్న ఒక్క సీటును గెలిచితీరతామని టీడీపీ దీమాగా ఉంది. లేదు లేదు ఏడుకు ఏడు సీట్లు తమవేనన్న దీమాలో వైసీపీ ఉంది. గెలుపోటములను రెబల్స్ టెన్షన్ ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ తొలి ఓటు వేశారు.

Read more: తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు