యువతి ప్రాణాలు తీసిన మైనర్ డ్రైవింగ్
హైద్రాబాద్ లో ఏదో మూలన నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రధానంగా మార్కెట్‌లోకి వస్తున్న కొత్తకొత్త బైక్ లు,కార్ల మోజులో ఉన్న యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో అతివేగంగా కారు నడిపిన ఓ మైనర్…యువతి ప్రాణాలను బలిగొన్నాడు.బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శివాని అనే యువతిని వెనుక నుంచి ఢీకొట్టాడు.దీంతో ఆ యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది.అక్కడే ఉన్న పోలీసులు మైనర్ ని అదుపు లోకి తీసుకుని స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 
							 
							