ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పులు
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల పర్యటనలో స్వల్ప మార్పులు.
ఈ నెల 26 నుండి నవంబర్ 9 వరకు వరుస సభలు ఉంటాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తొలి విడత పర్యటనల్లో భాగంగా ఇప్పటికే ఈ నెల 15 నుండి 18 వరకూ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న విషయం మీకు తెలిసిందే. రెండో విడత పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుండి నవంబర్ 9 వరకు వరుస బహిరంగ సభల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉండగా.. ఇందులో నాగర్ కర్నూల్ స్థానంలో వనపర్తికి బహిరంగ సభను మార్చారు. 27న పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్ బహిరంగ సభ షెడ్యూల్ ముందుగా నిర్ణయం కాగా.. తాజా మార్పుల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు బదులుగా మహబూబాబాద్, వర్ధన్నపేట చేరాయి. ఇవి మినహా మిగిలిన తేదీల్లో నియోజకవర్గాల వారీగా ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే బహిరంగ సభలు జరుగుతాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో.. 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో.. 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో.. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందులో.. 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురిలో.. 3న భైంసా (ముదోల్), ఆర్మూర్, కోరుట్లలో.. 5న కొత్తగూడెం, ఖమ్మంలో.. 6న గద్వాల, మక్తల్, నారాయణపేటలో.. 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లిలో.. 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 9న మధ్యాహ్నం ఒంటి గంటకు గజ్వేల్‌లో, 2 గంటలకు కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అదే రోజు 4 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సభలు వరుసగా నియోజకవర్గాల వారీగా ప్రచార గడువు ముగిసే వరకూ నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.