Andhra PradeshHome Page Slider

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలుగా మంత్రి రోజా

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి నుంచి సోమవారం ఆమెకు ఆదేశాలు అందాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలుగా నియమితులు కావడాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రజాప్రతినిధులు అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ క్రీడారంగం అభివృద్ధికి తాను ఎప్పుడు ముందుంటానని క్రీడాలంటే తనకి ఎంతో ఇష్టమని ఆ రంగంలోనే పదవులు తనను వరిస్తున్నాయన్నారు. జగనన్న క్రీడా సంబరాలు ,సీఎం కప్పు పోటీలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు అంటూ క్రీడాకారులకు అత్యున్నత ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. పలు ప్రాంతాల్లో క్రీడాకారులకు మైదానాల సిద్ధం చేసి అందించడంతోపాటు తన ట్రస్ట్ ద్వారా క్రీడాకారులకు సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. మంత్రి రోజా నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.