విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానన్న మంత్రి ధర్మాన
ఈ రోజు ఏపీ సీఎం జగన్‌తో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. కాగా మంత్రి ధర్మాన విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానని సీఎంకు తెలిపారు. అంతేకాకుండా రాజీనామాకు అనుమతించాలని ఆయన సీఎంను కోరారు. దీంతో మంత్రి ధర్మానను సీఎం జగన్ వారించారు. మన ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అభివృద్దిని అన్ని ప్రాంతాలకు పంచాలంటే..వికేంద్రికరణ,సమగ్రాభివృద్ది ఒక్కటే మార్గమని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా..మంత్రి పదవి గొప్పది కాదన్నారు. విశాఖ రాజధాని ఉద్యమం చురుగ్గా..చైతన్యవంతంగా సాగేందుకే ఈ నిర్ణయమని మంత్రి ధర్మాన సీఎంకు తెలియజేశారు.

