ఉరేసుకుని వైద్యవిద్యార్థి ఆత్మహత్య
తెలంగాణాలో వరుసగా వైద్యవిద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వరంగల్ వైద్యవిద్యార్థి ఆత్మహత్యాయత్నం మరువక ముందే MBBS చదువుతున్న మరొక వైద్యవిద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష (21) నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు ఉదయం హాస్టల్‌లో రూమ్‌లో హర్ష ఉరేసుకొని ఉండడం చూసిన స్నేహితులు పోలీసులకు తెలియజేశారు. విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అతడు తెలివైన విద్యార్థి అని, మంచి మార్కులే వచ్చేవని పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

